నెలరోజులు మాంసాహారం మానేస్తే ఇన్ని లాభాలా.. అలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

దేశంలో 80 శాతం మంది మాంసాహారులు ఉంటే 20 శాతం మంది శాఖాహారులు ఉన్నారు. అయితే ఒకసారి మాంసాహారం తిన్నవాళ్లు మళ్లీమళ్లీ మాంసాహారం తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే నెలరోజులు మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల ఊహించని స్థాయిలో లాభాలను పొందవచ్చు. వైద్యులు సైతం శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు.

అయితే మాంసాహారాలలో చేపలు తినడం వల్ల ఎలాంటి నష్టం కలగదు. ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉంటూ సాధారణ మాంసాహారం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శాఖాహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గడంతో పాటు మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో శాఖాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. శాఖాహార ఉత్పత్తులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయి. శాఖాహారం శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు మధుమేహం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు సైతం తగ్గుతాయని చెప్పవచ్చు.

శాఖాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు సైతం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. శాఖాహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు సైతం మాంసాహారానికి దూరంగా ఉండాలి.మాంసాహారం పరిమితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో మాంసాహారం తీసుకుంటే మాత్రం లాభం కంటే నష్టాలే ఎక్కువని చెప్పవచ్చు. ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు మాంసాహారానికి పూర్తిస్థాయిలో దూరంగా ఉంటే మంచిది.