మనలో చాలామంది నాన్ వెజ్ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు. అయితే మాంసాహారంతో కలిపి కొన్ని వంటకాలను అస్సలు తినకూడదు. ఈ వంటకాలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. మాంసాహారం తినే సమయంలో పుచ్చకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
మాంసాహారం తినేవాళ్లు సిట్రస్ ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. మాంసం తినే సమయంలొ నిమ్మకాయకు దూరంగా ఉంటే మంచిది. పాలు, పాల ఉత్పత్తులను చేపలు, ఇతర సముద్రపు ఆహారాలతో కలిసి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. చికెన్ ను ఇష్టంగా తినేవాళ్లు చికెన్ తో పాటు టమోటాలను తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.
రెండు వేర్వేరు జాతులకు సంబంధించిన మాంసంను ఒకే సమయంలో తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మాంసాహారంతో రెడ్ వైన్ ను తీసుకోవడం మంచిది కాదు. నాన్ వెజ్ తో రెడ్ వైన్ తీసుకుంటే కారం రుచి పెరిగి కడుపులో మంట కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. నాన్ వెజ్, చేపలతో ఎక్కువ రుచి ఉన్న చీజ్ ను తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.
మాంసాహారంతో కలిసి స్వీట్ సాస్ ను తీసుకోవడం వల్ల కూడా హెల్త్ కు హాని కలుగుతుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారం తీసుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మాంసాహారం తినడం వల్ల లాభాలు ఉన్నా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.