మనలో చాలామంది మటన్ తినడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. కొందరు చికెన్ కంటే మటన్ నే ఎక్కువగా ఇష్టపడినా మటన్ ఖరీదు మరీ ఎక్కువ కావడంతో చికెన్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. మాంసం పరిమితంగా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చనే సంగతి తెలిసిందే. చికెన్, మటన్ ఎవరైతే తింటారో వాళ్లు శారీరకంగా బలంగా ఉండే ఛాన్స్ ఉంది.
అయితే మటన్ తినేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు మటన్ తింటే మాత్రం ఆ ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డయాబెటిస్, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధ పడేవాళ్లు మటన్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. వారంలో ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు మాంసం తినడం కరెక్ట్ కాదు.
మటన్ తో పాటు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. కొన్ని ఆహార పదార్థాలను మటన్ తో కలిపి తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశంతో పాటు అసిడిటీ, ఇతర సమస్యలు వస్తాయి. మటన్ తినేవాళ్లు ఆ సమయంలో టీ, కాఫీ, తేనె తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మటన్ తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
మటన్ ను ఫ్రైలా తీసుకోవడానికి బదులుగా కర్రీలా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. చికెన్, మటన్ తరచూ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. తరచూ చికెన్, మటన్ తినే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హెల్త్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది.