బ్రేక్ ఫాస్ట్ గా ఇవి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. లాభాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలసట, సోమరితనంతో రోజంతా ఇబ్బంది పడేవాళ్లు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది.

ఉదయం నిద్ర లేచిన వెంటనే గ్లాసు నీళ్లను తాగాలి. అల్పాహారంలో గింజలు, విత్తనాలను చేర్చుకోవాలి. వీటి వల్ల శరీరంలో శక్తి చేరడంతో పాటు అలసట దూరమవుతుంది. గుమ్మడి, వాల్ నట్ లు, జీడిపప్పు, మఖానా, ఖర్జూరం, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మునక్క, బాదం, ఎండు ద్రాక్ష పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది.

చక్కెర లేదా తేనెతో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బలంగా ఉండాలని కోరుకునే వాళ్లు పాలతో కూడా వాటిని తీసుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బలహీనత, అలసట సమస్యలను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. రోటూ రొటీన్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి ఆహారపు అలవాట్లను నేర్పిస్తే వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లలు చిన్నతనం నుంచి మంచి అలవాట్లను నేర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరుతాయి.