ప్రస్తుతం ప్రతి 100 మందిలో 50 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ వినియోగం పెరగడంతో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే మీ కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంటే మాత్రం కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కంటి సంబంధిత సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.
చదవడం, డిజిటల్ పరికరాలను ఉపయోగించడం, ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం, స్క్రీన్‌లను చూస్తూ ఎక్కువ సేపు గడపడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. కళ్ళు తీవ్రంగా ఉపయోగించడం వల్ల కలిగే సాధారణ పరిస్థితిని కంటిపై ఒత్తిడి కలగడానికి కారణమని అంటారు. కంటి అలసట లేదా అస్తెనోపియా అని అంటారు.
పొడి కళ్ళు, అలసిపోయిన కళ్ళు, బర్నింగ్ లేదా దురద, నీళ్ళు నిండిన కళ్ళు, అస్పష్టమైన లేదా డబుల్ దృష్టి, దృష్టి పెట్టడంలో ఇబ్బంది, తలనొప్పి ఇతర సమస్యలు వేధిస్తాయి. రెగ్యులర్ బ్రేక్‌లు తీసుకోవడం, స్క్రీన్ కు కంటికి తగినంత దూరం ఉండేలా చూసుకోవడం, కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు ఈ సమస్యలు వేధిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.
స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, ఫాంట్‌ని సర్దుబాటు చేయడం ద్వారా కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. చీకటిలో ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌లో వర్క్ చేయడం వల కంటిపై నెగిటివ్ ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. ఎక్కువగా నొప్పిగా అనిపించిన సమయంలో ఐ డ్రాప్స్ వాడటంతో పాటు కొన్ని ట్యాబ్లెట్లను వాడటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.