పారాసిటమాల్ టాబ్లెట్ ఎక్కువగా వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇంత ప్రమాదమా?

ఈ మధ్య కాలంలో చాలామంది పారాసిటమాల్ టాబ్లెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఈ టాబ్లెట్ పై ఆధారపడుతున్నారు. జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే చాలామంది పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని ఫీలవుతున్నారు. అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మాత్రం పారాసెటమాల్‌ సహా 50 రకాల మెడిసిన్ల విషయంలో సందేహాలు వ్యక్తం చేసింది.

తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పారసిటమాల్ లేదని ఆర్గనైజేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విధంగా జరగడం వల్ల మందులు ఉద్దేశించిన విధంగా పని చేయకపోవడం లేదా రోగులకు హాని కలిగించడం జరుగుతుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి డ్రగ్ శాంపిల్స్ తీసుకున్న అధికారులు నిబంధనలు అతిక్రమించిన ఫార్మాస్యూటికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

అయితే వైరల్ అవుతున్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఈ జాబితాలో ఉంటుందని అస్సలు ఊహించలేదని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ నాణ్యతలో రాజీపడకూడదని వైద్య నిపుణులు వెల్లడించడం గమనార్హం.

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. అవసరం అయితే మాత్రమే ఈ ట్యాబ్లెట్ ను వాడాలని మరీ ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదమని గతంలో కొన్ని వైద్య నివేదికల ద్వారా వెల్లడైంది.