రోజ్ టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలకు చెక్ అంటూ?

మనలో చాలామంది రోజ్ టీ తాగడానికి ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో రోజ్ టీ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరైతే రోజ్ టీ తాగుతారో వారి శరీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండటంతో పాటు వాళ్లు డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. రోజ్ టీలో కెఫిన్ ఉండదనే సంగతి తెలిసిందే. రోజ్ టీ తాగడం వల్ల జీర్ణ, కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

రోజ్ టీ తాగడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు దూరం కావడంతో పాటు అలసట తగ్గుతుంది. రోజ్ టీ మూడ్ స్వింగ్స్ లేకుండా చేయడంతో పాటు పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలకు చెక్ పడుతుంది. రోజ్ టీ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశం ఉంటుంది. రోజ్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్లు సులువుగా దూరమవుతాయి.

శ‌రీరంలోని వ్య‌ర్థాలను తొలగించడంలో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రపరిచేలా చేయడంలో రోజ్ టీ తోడ్పడుతుందని చెప్పవచ్చు. అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఉన్నవాళ్లు ప్రతిరోజూ రోజ్ టీ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. గులాబీ పువ్వుల టీని తాగితే కొవ్వును సులువుగా కరిగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎండిన గులాబీలు మూడు, గులాబీ వాటర్ టీస్పూన్, తేనె రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం అరటీ స్పూన్, నీళ్లు లీటర్, గ్రీన్ టీ బ్యాగులు తీసుకుంటే మంచిది.

పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకులు, నిమ్మరసం వేసి 5 గంటల పాటు పక్కన పెట్టుకుంటే మంచిది. గులాబీ రేకులు బాగా నాని అందులోని సారం నీటిలోకి చేరుతుంది. రెండు గ్రీన్ టీ బ్యాగులు ఆ నీటిలో వేసుకుని తిరిగి మరిగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఐదునిమిషాల తరువాత తేనె వేసుకుని వడకట్టుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

రోజ్ టీ తాగడం వల్ల మన శరీరానికి లాభాలే తప్ప నష్టాలు లేవు. రోజ్ టీని డైట్ లో భాగం చేసుకుంటే మంచిది. రోజ్ టీ వల్ల దీర్ఘ కాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది.