ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టే.. అప్రమత్తం కాకపోతే ఇబ్బందేనా?

ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రతి సంవత్సరం కిడ్నీ వ్యాధులతో బాధ పడుతూ కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుండటం గమనార్హం. కిడ్నీ వ్యాధుల బారిన పడి సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

మధుమేహం, హైబీపీ సమస్యలతో బాధ పడేవాళ్లకు కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తక్కువగా మూత్ర విసర్జన, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండలం వద్ద వాపు కిడ్నీ సంబంధిత సమస్యల లక్షణాలు అని చెప్పవచ్చు. కిడ్నీలో ఉప్పు లేదా ఇతర స్పటికాలు రాళ్లుగా ఏర్పడతాయి. మూత్రంలో రక్తం, రాయి ఉన్న భాగంలో నొప్పి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మంచిది. శరీరం ఉబ్బడం, ఉబ్బసం, వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, వెన్నునొప్పి, తల తిరగడం, మెడనొప్పి, వికారం, వాంతులు లాంటి లక్షణాలు సైతం కిడ్నీ వ్యాధి సంకేతాలు అని చెప్పవచ్చు. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీకి సంబంధించిన సమస్య అయ్యే అవకాశాలు ఉంటాయి. సమస్యను వేగంగా గుర్తించడం ద్వారా సులువుగా సమస్య నుంచి బయటపడవచ్చు. సొంతంగా టాబ్లెట్లను వాడకుండా వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం మాత్రలను తీసుకోవాలి.