భార్యాభర్తల మధ్య అనుబంధం అన్యోన్యంగా ఉండాలి అంటే వారి మధ్య లైంగిక జీవితం కూడా అలాగే ఉండాలి ఎవరి మధ్య అయితే లైంగిక అనుబంధం బాగుంటుందో అలాంటి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది పెళ్లయిన కొత్తలో తరచూ సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. తర్వాత పెద్దగా శృంగారం పట్ల ఆసక్తి లేకుండా అయిష్టంగా ఉంటారు. ఇక చాలామంది శరీర బరువు పెరగటం వల్ల తరచూ జిమ్ కి వెళ్తూ వ్యాయామం చేస్తూ ఉంటారు.
ఇలా జిమ్మకు వెళ్లి శరీర బరువు తగ్గించుకోవడం కన్నా ప్రతిరోజు సెక్స్ లో పాల్గొనడం వల్ల మీరు జిమ్ లో గంటలపాటు కష్టపడి తగ్గించిన అన్ని కేలరీలను ఇక్కడ తగ్గించవచ్చు.ఒకసారి సెక్స్ లో పాల్గొనడం వల్ల ఏకంగా 150 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు శృంగారంలో పాల్గొనడం వల్ల వెంటనే నిద్ర వస్తుంది.
శృంగార సమయంలో శరీరంలో ఆక్సిటోన్స్ ఎండార్పిండ్లు విడుదలవుతాయి తద్వారా శరీరం విశ్రాంతిని కోరుకొని నిద్ర వస్తుంది. అలాగే రక్తప్రసరణ వ్యవస్థ పై ప్రభావం చూపి ఏ విధమైనటువంటి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.ఇక తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే మహిళలలో రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. వారిలో ఫెర్టిలిటీ సమస్య తగ్గి ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.