మనలో చాలామంది నిద్ర లేచిన వెంటనే చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఎక్కువమంది నిద్రలేచిన వెంటనే మెుబైల్ ఫోన్ చూడడానికి ప్రాధాన్యత ఇస్తారు. నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. ఆహారం, విశ్రాంతి, వ్యాయామం శరీరానికి, మానసికోల్లాసానికి ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.
ఉదయం నిద్రలేచిన వెంటనే ఆరోగ్యానికి హాని చేసే కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మెుబైల్ నుంచి వచ్చే కాంతి.. కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. నిద్రలేవగానే కొంతమందికి బెడ్ కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రష్ చేయకుండా అలా నేరుగా కాఫీ, టీ తాగడం మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్రష్ చేసిన తర్వాత మాత్రమే టీ, కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేస్తే కండరాలపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చు. ఉదయం సమయంలో అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి.
తీసుకునే ఆహారానికి సంబంధించి ఏవైనా పొరపాట్లు చేస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నిద్ర లేచిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయి.