సాధారణంగా పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి కొత్త కోడలు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శాస్త్ర ప్రకారం కొత్తకోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన మొదటి ఆరు నెలలలో ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రవర్తన గురించి భర్తతో ఫిర్యాదు చేయరాదు. అలాగే కుటుంబ సభ్యులు ఎంత పరుషంగా మాట్లాడినా కూడా కంటతడి పెట్టరాదు.
• అలాగే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కొత్త కోడలు తన భర్త బట్టలు తప్ప ఇతరుల బట్టలు ఉతకరాదు.
• అలాగే వివాహం జరిగిన ఆరు నెలల వరకు భర్త కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఒంటరిగా దేవాలయాలకు, శుభకార్యాలకు వెళ్ళరాదు.
• అలాగే మహిళలు వివాహం జరిగిన తర్వాత ఎప్పటికీ పూర్తి నల్లని దుస్తులను లేదా తెల్లని దుస్తులను ధరించరాదు.
• అలాగే పాదరక్షలు ధరించి ఇంట్లో తిరగకూడదు.
• కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తన చేతులతో కుటుంబ సభ్యులకు పెట్టాలి.
• అలాగే వివాహం తర్వాత వచ్చే మొదటి అమావాస్య రోజున భర్త తోడు లేకుండా పుట్టింట్లో ఒంటరిగా గడపాలి.
• వివాహం జరిగిన ఆరు నెలలలోగా అత్తవారింటికి చెందిన బంధువులు ఎవరైనా మరణిస్తే శవదహనం అయిన తర్వాత 21 రోజులు పాటు పుట్టింట్లోనే ఉండాలి.
• అలాగే కొత్త కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు. ఒకవేళ అలా చేయించాలని భావించేవారు కోడలిని పుట్టింటికి పంపిన తర్వాత ఇంటి మరమ్మతులు చేయించాలి.