మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నప్పటికీ వాస్తు శాస్త్రం పట్ల ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందువల్ల ఏ పని చేసినా కూడా వాస్తవనియమాలను అనుసరిస్తూ చేస్తున్నారు. అలాగే నిద్రించే సమయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తున్నారు. నిద్రించే సమయంలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. .
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రివేళ నిద్రించే సమయంలో ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే..దక్షిణం కనిపిస్తుందని, అది యమస్థానమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరదిక్కున తలపెట్టి నిద్రించటం వల్ల అకాల మరణం సంభవిస్తుందని ప్రజల నమ్మకం. అలాగే పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే తూర్పు వైపు కాళ్లు పెట్టాలి. ఉదయించే సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు కాబట్టి పడమరవైపు తలపెట్టి పడుకోకూడదు.
మరి ఏ దిక్కున తలపెట్టి పడుకుంటే మంచిదనే సందేహం అందరికీ ఉంటుంది. ప్రతిరోజు తూర్పు వైపున తలపెట్టి , పడమర వైపు కాళ్లు పెట్టి పడుకోవచ్చు లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్లుపెట్టి పడుకోవడం మంచిది. అయితే పడుకునేముందు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలని శాస్త్రం చెబుతోంది.వాస్తు ప్రకారం తల తూర్పు దిక్కున పాదాలు పడమర దిశలో పెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది. వాస్తవానికి, సూర్యుడు తూర్పు నుండి ఉదయిస్తాడు. దాని మొదటి కిరణం తూర్పున మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఈ దిశలో మీ తలపెట్టి నిద్రించడం వల్ల ఉదయపు మొదటి కిరణం మీ తలపై పడుతుంది. ఫలితంగా, మీ లోపల కొత్త శక్తి ప్రసారం అవుతుంది.