మనలో చాలామంది మెట్లు ఎక్కడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఇబ్బంది అని ఫీలవుతారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెట్లు ఎక్కడం వల్ల శరీర కండరాలు ధృఢంగా మారే అవకాశం అయితే ఉంటుంది. శరీరానికి ఇదొక మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. మెట్లు ఎక్కడం వల్ల కాలి కండరాలు బలోపేతం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తే రక్తంలో చక్కెర తగ్గడంతో పాటు ఆర్థరైటిస్ నొప్పులు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతిఒక్కరికీ చాలా అవసరం. భవిష్యత్తులో గుండె సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ ఎంతో తోడ్పడనుంది. శరీరంలో సత్తువను పెంచే వ్యాయామాలు రోజువారిగా అలవాటు చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.
నడక, పరుగు, దినచర్యలు ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. వాకింగ్ , జాగింగ్ కంటే మెట్లు ఎక్కడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బరువును సులభంగా తగ్గించే మార్గాల్లో నడక కన్నా మెట్లు ఎక్కటం మంచిదని చెప్పవచ్చు. మెట్లు ఎక్కటం అన్నది ప్రారంభించిన తొలినాళ్లల్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో కీళ్ల నొప్పులు సైతం వేధిస్తాయి.
స్ధూలకాయులకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ 20 – 30 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేయటం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడం వల్ల దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కనీసం 20 మెట్లు ఎక్కిన పురుషులకు గుండె ప్రమాదం తక్కువగా ఉంటుంది.