ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లలకు ఏ కష్టం తెలియకుండా వారు సంతోషంగా ఉండాలని భావించడం సర్వసాధారణం అయితే తమ పిల్లల గురించి తల్లితండ్రులు ఇలా ఆలోచించడం తప్పులేదు కానీ అసలు పిల్లలకు కష్టం విలువ తెలియకూడదు అనుకోవడం పూర్తిగా తప్పని చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం శాయశక్తుల కష్టపడి వారికి ఏ కష్టం తెలియకుండా పెంచడం పెద్ద పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇవే పొరపాట్లు చేస్తున్నారు.పిల్లలను ఎలాంటి కష్టం తెలియకుండా పెంచుతున్నారు. అయితే ఇది పూర్తిగా తప్పు పిల్లలకు కష్టసుఖాలు తప్పనిసరిగా తెలియాలి మీరు వారి వెనుక ఉండి వారిని నడిపించాలి తప్ప వారి నడకని కూడా మీరు నడవకూడదు. ఇక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం వారి ఆధీనంలో మాత్రమే ఉంచుకుంటారు కనీసం తన ఇతర కుటుంబ సభ్యులకు కూడా వారిని దూరంగా ఉంచుతున్నారు ఇలా చేయడం పూర్తిగా తప్పు.
తరచూ ఇతర కుటుంబ సభ్యులతోనూ పెద్దవారితోను కలవడం చేస్తూ ఉండటం వల్ల పిల్లలలో మరింత ఆలోచన సామర్ధ్యాలు సరికొత్త విషయాలు తెలుస్తాయి. ఒకవేళ తరచూ ఇంట్లో ఉన్న పెద్ద వారిని కలిసే వీలు లేకపోతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ ద్వారా తమ పిల్లలను తమ కుటుంబ సభ్యులకు దగ్గర చేయాలి. ఇక పిల్లలు అడిగినది ఏమాత్రం లోటు లేకుండా వారిని గారాభం చేస్తూ వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు.ఇక మరి కొంతమంది ఎప్పుడూ కూడా సెల్ ఫోన్లకు అంకితమై ఉంటారు. అయితే కొందరు తల్లిదండ్రులు ఈ విషయంపై పిల్లలను ఏమాత్రం కంట్రోల్ చేయరు ఇలా సెల్ఫోన్లకు అంకితం కావడం వల్ల భవిష్యత్తులో వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే ఈ విధమైనటువంటి పొరపాట్లను చేయకూడదని నిపుణులు వెల్లడిస్తున్నారు.