పూర్వం మన పెద్దలు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ముఖ్యంగా కుటుంబ ఆచార వ్యవహారాలు, కుటుంబ స్థితిగతులు, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ సభ్యుల మనస్తత్వం, పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయి వయస్సు ఇలా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెళ్లి నిర్ణయానికి వచ్చేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వధువు లేదా వరుడు కి సంబంధించిన అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెళ్లి తంతు మొదలుపెట్టేవారని మన పెద్దలు చెప్తుంటారు.
కానీ ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం వల్ల ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోవట్లేదు ఫలితంగా ఏడాదికే విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే ప్రేమలో పడి వివాహం చేసుకోవడం వల్ల దాంపత్య జీవనం, కుటుంబ వ్యవహారాలు, పిల్లల పెంపకం విషయంలో మెచ్యూరిటీగా ఆలోచించే జ్ఞానం లోపించడం వల్ల దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. అసలు వివాహం చేసుకోవడానికి దంపతుల మధ్య ఎంత వయస్సు వ్యత్యాసం ఉండాలి అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
వివాహం చేసుకొని విషయంలో అమ్మాయి అబ్బాయి మధ్య వయస్సు వ్యత్యాసం కచ్చితంగా ఉండాలని చెబుతుంటారు.సాధారణంగా ఎక్కువ మంది ఇద్దరి మధ్య రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కారణం ఇద్దరూ ఒకేలాగా ఆలోచిస్తారు కాబట్టి జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం భార్యాభర్తల మధ్య 5-6 సంవత్సరాల గ్యాప్ ఉన్న జంట మధ్య వచ్చే గొడవలు, అపార్థాలు తక్కువగా ఉంటాయని తేలింది. వీరిలో ఎవరో ఒకరు మెచ్చురిటీగా ఆలోచించి, వారి మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడి, వెంటనే సర్దుకుపోతారట. ఈ ఏజ్ గ్యాప్ ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారని తేలింది.
భార్యాభర్తల మధ్య పది సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంటే వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగక ఏదో ఒక సమస్య తలెత్తి కచ్చితంగా విడిపోతున్నారని అధ్యయనంలో తేలింది. ఇక 20 సంవత్సరాల వయసు వ్యత్యాసంతో వివాహం చేసుకోవడమే వృధా అని 20 సంవత్సరాల వయసు వ్యత్యాసంతో వివాహం చేసుకొనే ఆలోచన కూడా చేయరాదని చెబుతున్నారు.