తరచూ తల తిరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామంది తల తిరుగుతోందని చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు తూలి పడిపోతున్నట్టు ఉంటోందని బాధ పడుతుంటారు. వర్టిగో, గిడ్డీనెస్ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి ఉదయం పూట నిద్ర లేవగానే తల తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. తిప్పడం కాస్త తగ్గితేనే బెడ్ నుంచి లేస్తూ ఉంటారు.

అయితే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని, దీన్ని సాధారణ సమస్యగా భావిస్తే చాలా నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తరచూ తల తిప్పడం అనేది వస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలని వారు అంటున్నారు.మీ బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోయినా తల తిరుగుతుంది. లోబీపీ రావడానికి ఇవి కారణాలు కావచ్చు.

గుండె కొట్టుకునే వేగం తగ్గడం, డిహైడ్రేషన్ గుండెలో రక్తంగడ్డ కట్టడం, అండ్రినలైన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతోంది. హై బీపీ ఉన్నవారు సరిగా మందులు వేసుకోపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగటం, తీసుకోవడం వల్ల కూడా ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కండరాలు బలహీనపడినా, గుండె సమస్యలు ఉన్నా కానీ పొద్దున్నే తల తిప్పుతుందని వైద్యులు చెబుతున్నారు.

కండరాలు బలహీనంగా మారడం వల్ల బ్లడ్ అనేది తక్కువగా పంపిణి చేయబడే అవకాశాలు ఉంటాయి. ఈ తరహా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదిస్తే మంచిది. డిహైడ్రేషన్ కారణంగా కూడా నిద్రలేచిన వెంటనే తల తిరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పొద్దున నిద్ర లేవగానే తలతిప్పినట్టు అనిపిస్తే దాన్ని సాధారణ సమస్యగా తీసుకోకుండా డాక్టర్ ను సంప్రదించి తగిన పరిష్కారం తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.