Bath Tips: స్నానం చేస్తున్నప్పుడు ఈ తప్పులను చేస్తున్నారా… అనారోగ్యానికి గురైనట్టే?

Bath Tips: ప్రతిరోజు మనం స్థానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అదేవిధంగా ప్రతిరోజు స్నానం చేయటం వల్ల మనకి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే చాలామంది స్కూల్స్ ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం సాయంత్రం చేస్తుంటారు. అయితే చాలామంది రోజు మార్చి రోజు కూడా స్నానం చేస్తూ ఉంటారు. అయితే మనం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసమే స్నానం చేస్తాము కనుక స్నానం చేసే సమయంలో మాత్రం ఈ తప్పులను చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది స్నానం చేసేటప్పుడు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇలా తప్పులు చేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలు వస్తాయి. మరి స్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులను చేయకూడదు అనే విషయానికి వస్తే… ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ షవర్ స్నానం చేస్తూ ఉంటారు షవర్ కింద స్నానం చేయటం వల్ల ఆడుతూ పాడుతూ స్నానం చేసి వస్తుంటారు తప్ప మన శరీర భాగాలను శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు.

చాలామంది నాభి శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. పొట్టను శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పటికీ నాభిని మాత్రం చాలా మంది శుభ్రం చేయడాన్ని మర్చిపోతారు. ఇలా చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా స్కిన్ ఎలర్జీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక చెవి వెనుక భాగాన్ని కూడా చాలామంది సబ్బుతో శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. చెవి వెనుక భాగంలో ఎక్కువగా నూనె మృత కణాలు పేరుకుపోయి ఉంటాయి. ఇలా పేరుకుపోయినటువంటి వీటిని తొలగించాలి అంటే మనం సబ్బుతో శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే వేళ్ళ మధ్యలో గోర్లను కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోతుంటారు. ఇలా చేసుకోకపోతే బ్యాక్టీరియాలు పెరిగి ఎన్నో రకాల స్కిన్ ఎలర్జీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.