సీజనల్ గా దొరికే అన్ని పండ్లను మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పండు మన ఆరోగ్యానికి మంచిదే మన శరీరంలో నిత్యజీవక్రియకు అవసరమైన అన్ని రకాల పోషకాలను, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అయితే ఈరోజు మనం బొప్పాయి పండు తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
మన నిత్య జీవక్రియలకు అవసరమైన పోషకాలు, ఔషధ గుణాలు బొప్పాయి పండులో సమృద్ధిగా లభ్యమవుతాయి. బొప్పాయి పండ్లు ఏడాది పొడవున అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటూ మన ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఏ , సి,డి, బీ ఫైబర్, క్యాల్షియం,పాంతోనిక్ ఆమ్లాలు, బిటాకెరోటిన్, పోలేటు వంటి ఖనిజలవణాలు పుష్కలంగా లభ్యమవుతాయి.
బొప్పాయి లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే చిగుళ్ల సమస్యను, చర్మ సమస్యను దూరం చేస్తుంది. అయితే విటమిన్ సి అధికంగా తీసుకుంటే గ్యాస్టిక్, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
బొప్పాయి పండ్లలో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్దక సమస్యను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. అయితే బొప్పాయి పళ్ళను అధికంగా తింటే కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి పండ్లలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి. కావున బ్లడ్ షుగర్ లెవెల్స్ తీవ్రంగా తగ్గుతాయి. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అధికంగా తీసుకుంటే గుండె వేగం తగ్గే ప్రమాదం ఉంది.
గర్భిణీ స్త్రీలు అధికంగా బొప్పాయిని ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే ల్యాక్టేషన్ వల్ల యుటేరియన్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో గర్భిణీ స్త్రీలలో అబార్షన్ కు కారణం అవుతుంది. బొప్పాయి పండులో పపైన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.శ్వాస సమస్యలు, ఆస్త్మా, అలర్జీ సమస్యలున్నప్పుడు బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది.
బొప్పాయి పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, పపైన్ వల్ల చర్మాన్ని పసుపు రంగులో మారుస్తుంది, కళ్ళు కాంతిహీనంగా కనిపిస్తాయి, మన శరీరంలో పసుపు వర్ణాన్ని కలిగిస్తుంది ఇది కామెర్ల గారికి దారి తీయవచ్చు.
బొప్పాయి పండుకు తినడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అయితే, హై ఫీవర్ ఉన్నప్పుడు
బొప్పాయి పండును తినడం వల్ల మన శరీరంలో మరింత తీవ్రమైన వేడి కలుగుతుంది. కావున అధిక జ్వరంతో ఉన్నప్పుడు బొప్పాయి పండును తినకపోవడమే మంచిది. ఏది ఏమైనా బొప్పాయి పండును తగు పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అతిగా తింటే ఏ పండైన మనకు అనారోగ్యాన్ని కలగజేస్తాయి.