ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఇలాంటివి జరిగితే అవి అశుభానికి సంకేతం అని తెలుసా?

4-Easy-Ways-to-Clean-Up-Broken-Glass-Tips-from-the-Kitchn661

మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికి ప్రజలు సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు . అలాగే మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం మన జీవితంలో జరిగే మంచి చెడులను నిర్ణయిస్తుంది. అయితే కొంతమంది వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేసినా కూడా మరి కొంతమంది మాత్రం ఇప్పటికీ వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తూ ఉన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు జరిగే కొన్ని పనులు అశుభానికి సంకేతం. ఎటువంటి పనులు జరగడం వల్ల ఆ శుభంగా భావిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

 

సాధారణంగా ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తుమ్ముతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలా తుమ్మడం మంచిది కాదు. అయితే ఎవరైనా కావాలనే తుమ్మినప్పుడు దాని గురించి పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చు. అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తుమ్ములు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం పట్టించుకోకుండా ఉండటం మంచిది. అలాగే పెళ్లిచూపులు వంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అద్దం పగిలిపోతే కాసేపు ఆగి హనుమంతుడికి నమస్కరించి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది.

అదే విధంగా ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి బయటకు బయలుదేరినప్పుడు కాళీ బకెట్ ను చూడడం కూడా అశుభం. ఒకవేళ అలా చుస్తే కాసేపు ఆగి విఘ్నేశ్వరుని పూజించి ప్రార్థించి బయటికి వెళ్లడం మంచిది.అలాగే కొన్ని సందర్భాలలో పొరపాటున పాలు చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి. అలా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాలు చేయిజారి కింద పడిపోతే కొద్దిసేపు ఆగి పార్వతి దేవిని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అలాగే ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కత్తి,ఇనుము లాంటివి కింద పడితే బయటకి వెళ్ళకూడదు. వెంటనే హనుమంతుని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది.