మధుమేహం వల్ల కంటి సంబంధిత సమస్యలా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒకసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లను ఎక్కువగా కంటి సంబంధిత సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కంటి సమస్యలు వేధిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కంటిచూపును కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లను కంటిశుక్లం, నరాల పక్షవాతం, గ్లాకోమా సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కంటి సమస్యలతో బాధ పడే మరి కొంతమందిని డ్రై ఐ సిండ్రోమ్ సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కళ్లకు తగినంత లూబ్రికేషన్ అందకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన వాళ్లలో కళ్లు బాక్టీరియా దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్య బారిన పడితే కార్నియాపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కళ్లలో జిగట, నీరు కారుట, ఎర్రటి కన్ను, అస్పష్టమైన దృష్టి, ఫోటోఫోబియా లాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యచికిత్స చేయించుకుంటే మంచిది. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు, ఇన్సులిన్ లోపం, వాపు వల్ల ఈ సమస్యలు వస్తాయి. పదేళ్ల కంటే ఎక్కువగా షుగర్ తో బాధ పడుతుంటే ఈ సమస్య బారిన పడే ఛాన్స్ ఎక్కువని చెప్పవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఎక్కువని చెప్పవచ్చు. కార్ టికోస్టెరాయిడ్స్, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, సైక్లోస్పోరిన్ మందులను వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుని మందులు వాడటం ద్వారా బెటర్ రిజల్ట్స్ కలుగుతాయి.