ఈ మధ్య కాలంలో గుండెపోటు బారిన పడి మరణించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే, ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేయాలి. హెల్తీ డైట్ ను పాటించడం ద్వారా గుండె పోటు బారిన పడకుండా రక్షించుకోవచ్చు. రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా గుండెపోటు బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వారానికి ఐదు గంటల వరకు ఏరోబిక్ వ్యాయామం చేసే వాళ్లు గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.
గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. అధిక బరువు ఉండకుండా జాగ్రత్త పడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును మానుకుంటే ఆరోగ్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుంది.
పల్స్ తెలుసుకోవడం ద్వారా గుండె స్పందనల సంఖ్య, క్రమం, బలం గుర్తించవచ్చు. అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, నువ్వులు, జనపనార విత్తనాలు, కలోంజి విత్తనాలు, చియా విత్తనాలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.