కోల్ ఇండియాలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఆ స్కోర్ ఉంటే చాలంటూ?

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కోల్ ఇండియా కేంద్రాలు, అనుబంధ సంస్థల్లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కోల్ ఇండియా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 28 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్‌, గేట్‌ 2024 పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారాఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 640 ఉద్యోగ ఖాళీలలో మైనింగ్ ఉద్యోగ ఖాళీలు 263 ఉండగా సివిల్ ఉద్యోగ ఖాళీలు 91 ఉన్నాయి.

ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 102 ఉండగా మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 104 సిస్టమ్ ఉద్యోగ ఖాళీలు 40, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్- ఉద్యోగ ఖాళీలు 39 ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 అర్హత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

2024 సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2024 స్కోర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,60,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.