ఉప్పు శనగలు తినడం వల్ల కలిగే లాభాలివే.. ఇన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది ఉప్పు శనగలు ఎంతో ఇష్టంగా తింటారు. ఉప్పు శనగలు (చిక్‌పీస్) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు శనగలు బరువు తగ్గడానికి సహాయపడతాయని చెప్పవచ్చు. ఉప్పు శనగలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉప్పు శనగలు ఎంతగానో సహాయపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.

గుండె ఆరోగ్యానికి ఉప్పు శనగలు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును నివారించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. శాఖాహార మరియు వేగన్ వంటకాలలో మాంసానికి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. చిక్ పీస్ లో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌ లభిస్తాయి. మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ వంటి మినరల్స్‌ ను సైతం ఉప్పు శనగలు తినడం ద్వారా పొందవచ్చు.

మెగ్నీషియం, పొటాషియం సైతం ఉప్పు శనగలు తినడం ద్వారా పొందవచ్చు. ఫైబర్, ప్రోటీన్ లు సైతం ఉప్పు శనగలు తినడం ద్వారా లభిస్తాయి. వేయించిన చిక్‌పీస్‌ను స్నాక్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నాన్ వెజ్ కు సమానమైన శనగలు తినడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

అయితే బ్లడ్ ప్రెజర్, కిడ్నీ సంబందిత సమస్యలతో బాధ పడేవాళ్లు మాత్రన్ ఉప్పు శనగలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.