మనలో చాలామంది బబుల్ గమ్ ను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. రోజూ బబుల్ గమ్ నమిలే వారు పలు విషయాలపై దృష్టి పెడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బోర్ కొట్టిందని కొంతమంది మౌత్ ఫ్రెషనర్ గా మరి కొంతమంది బబుల్ గమ్ ను తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. చక్కెర లేని బుబుల్ గమ్‌లు, ముఖ్యంగా జైలిటాల్ ఉన్న వాటితో నోటి ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా లాలాజలం నోటికి సహజసిద్ధమైన రక్షణగా పని చేయడం జరుగుతుంది. బబుల్ గమ్ నమిలితే లాలాజలం ఉత్పత్తి పెరగడంతో పాటు హానికర ఆమ్లాలు న్యూట్రలైజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పళ్ల మధ్య ఉండే ఆహార అవశేషాలు కడుపులోకి వెళ్లడం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పళ్లపై ఉండే ఎనామిల్ రక్షణ పొర పునరుద్ధరణకు నోచుకునే ఛాన్స్ కూడా ఉండదు.
షుగర్ ఫ్రీ బబుల్ గమ్స్ మాత్రమే నమలాలని నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. బబుల్ గమ్ నమిలితే మెదడుకు రక్తసరఫరా పెరగడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగే ఛాన్స్ ఉంటుంది. విమానం టేకాఫ్ లాండింగ్ సమయాల్లో బబుల్ గమ్ నమిలితే చెవి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అతిగా బబుల్ గమ్ నమిలితే దవడ నొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
దవడ నొప్పి వల్ల తలనొప్పి, చెవి నొప్పి, ఆహారం తినడంలో ఇబ్బందులు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. చక్కెరలు ఉన్న బబుల్ గమ్స్ నమిలితే పళ్లకు హాని కలుగుతుందని చెప్పవచ్చు. పళ్లపై ఉండే ఎనామిల్ పొర కోతకు గురై కావిటీలు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుంది. బబుల్ గమ్ నమిలే వారి కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్లి ఉబ్బరం, గ్యాస్, కడుపు ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. భోజనం చేసిన తరువాత 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కెరలు లేని బబుల్ గమ్ నమిలితే ఆరోగ్యానికి మంచిది.