షుగర్ గురించి అందరికీ తెలుసు. ప్రతి కుటుంబంలో షుగర్ తో బాధపడేవారు కనీసం ఒక్కరైనా ఉంటారు. షుగర్ లేని కుటుంబాలు అరుదుగా కనిపిస్తాయి. షుగర్ రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, అజీర్తి సమస్య. చాలామందికి తెలియకపోవచ్చు, కొందరు అజీర్తి సమస్యతో షుగర్ వస్తుంది అంటే అస్సలు నమ్మరు. అజీర్తి వల్ల షుగర్ వస్తుంది అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది.
మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకోవడం, తగినంత శ్రమ చేయకపోవడం వల్ల శరీరంలో జీర్ణ సమస్య మొదలవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజాయ్ తగినంత విడుదల కాక మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఇంకా ఆహార పదార్థాలు అవసరం ఉన్న వాటికంటే ఎక్కువగా రక్తంలో చేరుతాయి. అప్పుడు రక్తంలో షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది.
రక్తానికి షుగర్ అవసరం కానీ అది మోతాదు మించితే దానినే డయాబెటిస్ అంటారు. అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తీసుకుంటే అది విషంతో సమానం అంటుంది ఆయుర్వేదం. ఏదైనా తగిన మోతాదులోనే తీసుకోవాలి. రాత్రి భోజనం చేశాక వెంటనే నిద్ర పోకుండా కనీసం రెండు గంటల సమయం ఉండాలి. కాస్త నడవడం, ఏదైనా పని చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
రాత్రిపూట కడుపు కాస్త ఖాళీ ఉండే విధంగా ఆహారం తీసుకుంటే మరీ మంచిది. నిద్ర కూడా తొందరగా వచ్చి శరీర అలసట తీరుతుంది. రక్తంలోకి చక్కెర కణాలు తక్కువగా చేరి అది కంట్రోల్ లో ఉంటుంది. మంచి డైట్ ఫుడ్ ను క్రమం తప్పకుండా ఫాలో అయితే మంచిది.
షుగర్ ను కంట్రోల్ చేయాలంటే మిరియాలను ఒక అర స్పూన్ తీసుకొని మెత్తగా కాకుండా రవ్వలాగా దంచి ఒక అర గ్లాస్ పాలలో వేసి కాస్త మరిగిస్తే పాల రంగు మారిపోయి మిరియాలు అన్ని పాలలో చేరిపోతాయి. ఆ పాలను వడగట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకొని, ఒక గంట వరకు ఏమీ తినడం, తాగడం చేయకూడదు. దీని ద్వారా షుగర్ లెవెల్ తగ్గి కంట్రోల్లో ఉండడం కొద్ది రోజుల్లోనే గమనించవచ్చు.