ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డ్ కావాలా.. సులువుగా ఎలా దరఖాస్తు చేయాలంటే?

మన దేశంలోని ప్రజలకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ ను జారీ చేస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పుట్టిన పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ ను కలిగి ఉంటే మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంతో ఇతర బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డ్ కావాలంటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను విజిట్ చేయడంతో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ ను ఫిల్ చేసి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డ్ కావాలంటే తల్లీదండ్రులకు సంబంధించిన ఆధార్ వివరాలు అవసరమని చెప్పవచ్చు. పిల్లల ఫోటోను తీయించి చిరునామాతో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పిల్లలకు బర్త్ డే సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లడం ద్వారా మాత్రమే పిల్లలకు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ లో గెట్ ఆధార్ ఆప్షన్ ద్వారా పిల్లల ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఐదేళ్ల లోపు పిల్లలకు వేలిముద్రలు స్పష్టంగా ఉండవు. పిల్లలకు తర్వాత రోజుల్లో వేలిముద్రలను అప్ డేట్ చేయించవచ్చు. సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా పిల్లల ఆధార్ కార్డ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. చిన్నవయస్సులోనే పిల్లలకు ఆధార్ కార్డ్ చేయిస్తే మంచిది.