కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా సులువుగా రూ.10 వేలు పొందే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ ఆ స్కీమ్స్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. మోదీ సర్కార్ తాజాగా ఇ-మొబిలిటీ స్కీం ప్రవేశపెట్టగా ఈ స్కీమ్ కొరకు కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండగా ఈ వాహనాలను కొనుగోలు చేసిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది.

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు కానుండగా టూ వీలర్, త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వాళ్లకు భారీ డిస్కౌంట్ లభించనుందని సమాచారం అందుతోంది. కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవాళ్లు ఈ బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల నుంచి నాలుగు నెలల పాటు ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం అందుతోంది.

ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా 10 వేల రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ద్విచక్ర వాహనాలకు ఈ మొత్తం సబ్సిడీగా ఉండనుంది. చిన్న త్రీ వీలర్స్ కు 31,000 రూపాయలు, పెద్ద త్రీ వీలర్స్ కు 50 వేల రూపాయల వరకు సబ్సిడీ ఉండనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సహా వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ పై ఆధారపడే అవకాశాలు తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను సైతం తగ్గించడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.