మనలో చాలామంది సరైన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చని భావిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య కూడా ఒకటి. చిన్న పిల్లల కోసం ప్రధానంగా ఈ స్కీమ్ అమలవుతోంది. నెలకు కేవలం 1000 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఏకంగా భవిష్యత్తులో 3 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంది.
ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ తో పాటు భారీ స్థాయిలో ఇతర ప్రయోజనాలు సైతం లభిస్తాయని చెప్పవచ్చు. పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై ఫోకస్ పెడితే మంచిదని చెప్పవచ్చు. మైనర్ అయిన పిల్లలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. నెలకు 1000 చొప్పున ఏడాదికి 12000 రూపాయలు డిపాజిట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు 3 లక్షల పెన్షన్ లభిస్తుంది.
దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రస్తుత కాలంలో నెలకు 1000 రూపాయలు పొదుపు చేయడం కష్టం కాదు. ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఎంతో బెనిఫిట్ కలిగించేవిగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లీదండ్రులకు ఈ స్కీమ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పడంలో అందేహం అవసరం లేదు. అయితే ఆ సమయానికి 3 లక్షల రూపాయలు తక్కువ మొత్తమే అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.