అబార్షన్ తర్వాత మహిళలు చెయ్యకూడని తప్పులివే.. ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటూ?

ప్రస్తుత కాలంలో మహిళలలో చాలామంది అబార్షన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారం, అలవాట్లు, పనిఒత్తిడి, ఇతర కారణాల వల్ల మహిళలలో చాలామంది అబార్షన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే అబార్షన్ తర్వాత కొన్ని తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని తప్పులు చేయడం వల్ల అబార్షన్ తర్వాత మహిళల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది.

అబార్షన్ జరిగిన తర్వాత ఒంటరి అనే భావనను కలిగి ఉండకూడదు. భర్త, కుటుంబ సభ్యులు అబార్షన్ జరిగిన మహిళకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు మందులు వాడేలా చూడాలి. మహిళ కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడంతో పాటు మానసిక ధైర్యం ఇస్తే మంచిది. అబార్షన్ జరగడానికి ఒక్కో సందర్భంలో ఒక్కో కారణం ఉంటుంది. ఈ తప్పుల వల్లే అబార్షన్ అయిందనే భావనను మొదట మరిచిపోవాలి.

అబార్షన్ జరిగితే సన్నిహితులు, బంధువులు ఏమనుకుంటారో అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తే మాత్రమే కెరీర్ పరంగా కోరున్నవి దక్కే అవకాశాలు ఉంటాయి. అబార్షన్ తర్వాత ఎక్కువగా ఆలోచించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.

కొన్నిసార్లు మరీ అవసరమైతే సైకియాట్రిస్ట్ సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. సైకియాట్రిస్ట్ సలహాల వల్ల అబార్షన్ అయిన మహిళలు మానసికంగా బలపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అబార్షన్ అయినా మళ్లీ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.