సాధారణంగా సుధీర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణం అందరికీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అయితే రైలులో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఆహారం కోసం కొంతవరకు ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే సరైన సమయానికి ట్రైన్ లో ఆహారం దొరకటం కష్టం. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఆహారం నాణ్యత,రుచి రెండూ ఉండవు. అందువల్ల రైలు ప్రయాణం చేసేవారు ముందుగానే ఇంటి నుండి తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ప్రస్తుతం రైలు ప్రయాణికులు ఆహారం కోసం ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు.
రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా రైలులో ప్రయాణించే సమయంలో మనం కోరుకున్న హోటల్ నుండి మనకు నచ్చిన ఆహారం పొందవచ్చు. ఎలాగంటే… రైలు ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వారికి నచ్చిన ఆహారాన్ని పొందొచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ప్రయాణికులు రైలులో ఆహారాన్ని ఆర్డర్ పెట్టవచ్చు. అలాగే ఫుడ్ ఆన్ ట్రాక్, www.catering.irctc.co.in వెబ్‌సైట్ల ద్వారా రైల్వే ప్రయాణికులకు ఈ సేవలని అందిస్తోంది. రైలులో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకునేవారు +918750001323 నెంబర్‌కు వాట్సప్ లో మెసేజ్ పంపించి… ఫుడ్ డెలివరీ సేవల్ని పొందొచ్చు.
అయితే ఈ సర్వేస్ ప్రస్తుతానికి కొన్ని రైళ్లల్లో మాత్రమే వుంది. ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత ఇతర రైళ్లల్లో కూడా సేవలని తీసుకు రానుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఐఆర్‌సీటీసీ ఈ వాట్సప్ సేవల్ని ప్రవేశపెట్టింది.
• ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి +918750001323 నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
• www.catering.irctc.co.in ఓపెన్ చేసి పీఎన్ఆర్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
• వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఒక లింక్ వస్తుంది.
ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి.
• ఇక పేమెంట్ పూర్తి చేసిన వెంటనే ఫుడ్ ఆర్డర్ ప్రాసెస్ పూర్తవుతుంది.