మనలో చాలామంది ఎవరి శరీరంపై అయినా బొల్లి మచ్చలు కనిపిస్తే తెగ టెన్షన్ పడతారు. ఇది ఒక చర్మ వ్యాధి కాగా విటిలిగో వ్యాధి వల్ల చర్మం పై తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మెలనోసైట్స్ లో లోపాలు జరగటం వల్ల అవి దెబ్బతిని చర్మంపై మచ్చలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఏ ప్రదేశం లో మెలనిన్ తయారీ అవ్వదో అక్కడ తెల్లటి మచ్చలుగా మిగిలిపోతాయని వైద్యులు చెబుతున్నారు.
చర్మంలో ఉండే మెలనిన్ కణాలు దెబ్బతిన్నాయి అంటే అవి మృతి చెందడం లేదా చర్మానికి హాని జరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. తెల్లటి మచ్చలు విటిలిగో వల్ల కానీ కొన్ని సందర్భాల్లో ఇతర సమస్యల వల్ల కానీ ఏర్పడతాయి. చర్మంపై కొన్ని ప్రదేశాలలో పిగ్మెంట్ ఏర్పడడం జరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. విటిలిగో శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ మచ్చలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లమచ్చలు అని చెబుతారు. సమస్య తీవ్రత పెరిగితే మచ్చలు తెల్లగా మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జెనిటిక్ సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని చెప్పవచ్చు. జీన్స్ వల్లే కాకుండా సంపూర్ణ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఒత్తిడి, సున్నితమైన చర్మం వంటివి ఉన్న వాళ్లకు ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎవరిలో అయితే గ్లూటాతియోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. గ్లూటాతియోన్ అనేది చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ కాగా శరీరంలో ఉండే హెవీ మెటల్స్ నుండి సంరక్షణ కలిగించడంలో ఇది సహాయపడుతుంది. మన శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపాలంటే గ్లూటాతియోన్ చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు.