ప్రయాణ సమయంలో వాంతులు, వికారం వల ఇబ్బందులు పడుతున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!

మనలో చాలామంది ప్రతిరోజూ బస్సులో రోజూ ప్రయాణం చేస్తుంటారు. అయితే వాహనాలలోప్రయాణం చేసే సమయంలో కొన్నిసార్లు వాంతులు కావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాహనాలు ఎక్కిన వెంటనే వికారం, వాంతుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ప్రయాణ సమయంలో వాంతులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ తరహా అనుభవాలు ఎదురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. సరిగ్గా లేని రోడ్లపై ప్రయాణం చేసేవాళ్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ తరహా సమస్యల వల్ల ఇబ్బందులు పడేవాళ్లు వాంతులు రాకుండా దొరికే ట్యాబ్లెట్లను వాడాలి. ప్రయాణంచే సమయంలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా కూడా ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు.

పొగ త్రాగే అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటుకు దూరంగా ఉంటే మంచిది. బస్సులో ప్రయాణించే సమయంలో సరైన వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇష్టమైన విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కిటికీ పక్క సీటును ఎంచుకుంటే ఈ సమస్యకు కొంతమేర చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.

వాంతులు, వికారం వల్ల ఇబ్బందులు పడేవాళ్లు బస్సులో ప్రయాణం చేయడానికి ముందు నీళ్లు ఎక్కువగా తాగకూడదు. పుల్లగా ఉండే చాక్లెట్లను తినడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిమ్మకాయ వాసన పీల్చడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.