బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రాతపరీక్ష లేకుండా డిగ్రీతో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 44 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35 వేల రూపాయాల వేతనం లభించనుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 531 రూపాయలు కాగా జనరల్, ఓబీసీ, మాజీ సర్వీస్ మేన్, మహిళలకు దరఖాస్తు ఫీజు 885 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే జాబ్ లో చేరితే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవడం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో వేతనం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.