మనలో చాలామంది ఎముకలు విరగడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన శరీరం సక్రమంగా పని చేయాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు కండరాలకు అండగా నిలవడంతో పాటు శరీరానికి స్థిరమైన ఆకారాన్ని కల్పించడంలో ఉపయోగపడతాయి. ఎముకలు విరిగినా అతుక్కునే శక్తి వాటికి ఉంటుంది. ఎముక విరిగిందంటే కొన్నిసార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
శస్త్రచికిత్స ద్వారా విరిగిన ఎముకలను అలాగే ఉంచి సరైన విధంగా అతుక్కునేలా చేస్తారు. ఎముకల బలానికి క్యాల్షియం పాస్పేట్ అవసరం కాగా ఎముక అతుక్కోవడం వయస్సును బట్టి మారుతుంది. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ఎముకలు అతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువమందికి ఫ్రాక్చర్లు అవుతున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంది.
ఎక్స్ రే, సిటీ స్కాన్ ద్వారా ఎముక ఎలా విరిగిందో గుర్తించి చికిత్స అందిస్తారు. కొన్ని ఫ్రాక్చర్లను సులభంగా స్క్రూలతోనే సరి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. తుంటి, భుజం బంతి కీలు విరిగితే కృత్రిమ కీలును అమర్చాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నూటికి 10 మందికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లేట్లు, రాడ్లు, స్క్రూలు బిగిస్తే ఏడాది నుంచి రెండేళ్ల తర్వాత తీసేయాల్సి ఉంటుంది.
ఎముక విరగడం అంటే ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. పసరు, నాటు కట్ల వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎముక ఏ మాత్రం పక్కకు జరిగినా ఆ వైకల్యాన్ని జీవితాంతం భరించాల్సి ఉంటుంది.