మనలో చాలామంది నిమ్మకాయను వేర్వేరు ఆరోగ్య అవసరాల కోసం నిమ్మకాయను వినియోగిస్తూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే నిమ్మ రసాన్ని తాగటం వల్ల శరీరంలో జరిగే మార్పులు అన్నీఇన్నీ కావు. వేడినీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తాగితే జలుబు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉండవు.
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో తోడ్పడుతుంది. నిమ్మరసం జీర్ణవ్యవస్థను కండీషన్‌లో ఉంచడంతో పాటు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి అజీర్తి లక్షణాలను తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు చర్మం మిలమిలా మెరుస్తుందని చెప్పవచ్చు.
బరువు తగ్గాలని భావించే వారు నిమ్మరసం తప్పకుండా తాగితే మంచిది. నిమ్మరసంతోపాటు రోజూ కొంత సమయాన్ని తేలికపాటి వ్యాయామానికి కేటాయిస్తే బరువు అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేయడంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది.
నిమ్మరసం తాగితే శ్వాస తాజాగా ఉండటంతో పాటు దంతాలపై ఉన్న ఎనామిల్‌ను రక్షించడానికి నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నిమ్మరసంలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొటాషియం బీపీని అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు