నల్ల యాలకులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

మనలో చాలామందికి నల్ల యాలకుల గురించి ఎక్కువగా అవగాహన ఉండదు. నిపుణులు, వైద్యులు నల్ల యాలకులు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యూలకులు కూడా ఒకటి కాగా క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. స్వీట్స్‌ రుచి, సువాసన పెంచడానికి, మసాలా వంటకాల్లో ఎక్కువగా యాలకులను ఉపయోగిస్తారు.

సిట్రస్‌, యూకలిప్టస్‌ ఫ్లేవర్‌లో ఉండే నల్ల యాలకులకు బలమైన సువాసన ఉంటుందనే సంగతి తెలిసిందే. మన దేశంతో పాటు నేపాల్, భూటాన్ లలో నల్ల యాలకులను ఎక్కువగా పండించడం జరుగుతుంది. నల్ల యాలకులలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉండగా కాలేయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో నల్ల యాలకులు ఎంతగానో సహాయపడతాయి.

గుండె లయను నిర్వహించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. రక్తం గడ్డకట్టడం, వేడి అలసట, స్ట్రోక్‌ ముప్పును తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో నల్ల యాలకులు సహాయపడతాయి. గ్యాస్ సమస్యలను సైతం యాలకులు దూరం చేస్తాయి.

అల్సర్ సమస్యలకు ఇవి సులువుగా చెక్ పెడతాయని చెప్పవచ్చు. నల్ల యాలకులలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు నోటి బ్యాక్టీరియాను దూరం చేయడంలో సహాయపడతాయి. నల్ల యాలకులు నమిలితే నోటిదుర్వాసన దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ రిస్క్ తో పాటు శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో ఇవి తోడ్పడతాయి. నల్ల యాలకుల వల్ల కలిగే ఈ ప్రయోజనాల వల్ల మనకు ఎంతో లాభం చేకూరుతుంది.