Bill Gates: బిల్ గేట్స్ అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఆయన నిద్రపోయి తెల్లారి లేచేసరికి ఆయన ఆదాయం వందల కోట్లలో పెరిగిపోయేదని ఓ టాక్ నడిచేది గతంలో. నేటి కంప్యూటర్ విప్లవానికి ఆయనే నాంది. అటువంటి గేట్స్ వరుసగా ఎన్నేళ్లు ప్రపంచంలో అత్యధిక సంపన్నుడిగా వెలిగిపోయాడో కదా. మరి.. అటువంటి వ్యక్తి తెలియకపోవడం ఏంటి..? ఆయన కుటుంబం.. భార్య, పిల్లల గురించి పెద్దగా తెలియకపోవచ్చు గానీ..! అవును.. మరి బిల్ గేట్స్ గారాల పట్టి ఫిబి అడెల్ గేట్స్ గురించైతే తెలీదు కదా..!
బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫిబి అడెల్ గేట్స్. ఈమె ఆఖరి సంతానంగా 2002 ఏప్రిల్ 14న వాషింగ్టన్ లో జన్మించింది. ఈమె వయసు ప్రస్తుతం 19 ఏళ్లు. ఈమె మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. బిల్ గేట్స్ కి ఉన్న తెలివితేటలు, చొరవ, చురుకుదనం.. అన్నీ ఫిబీలో ఉన్నయని పరిశీలకులు అంటూంటారు. న్యూయార్క్ లోని ప్రొఫెషనల్ చిల్డ్రన్ స్కూల్ లో చదివి.. అనంతరం లింకన్ సెంటర్లోని అమెరికన్ బ్యాలెట్ స్కూల్లో చదువుకుంది. అప్పటినుంచే ఆమెలో తెలివితేటలు గమనించారట కూడా.
దాదాపు 15వ ఏట వచ్చేవరకూ ఫిబీకి స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదట గేట్స్. కారణం.. పిల్లల భవిష్యత్ పై ప్రభావం పడకుండా ఉండాలంటే వారికి అప్పటివరకూ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుండా ఉండటమే బెస్ట్ అని గేట్స్ అభిప్రాయం. అమెరికన్ కల్చర్ కి ఫిబీ ఏమాత్రం తీసిపోదు. ఆమధ్య బికినీలో బోటులో ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాను ఊపేశాయి. డిగ్రీ కాన్వొకేషన్ కి పొడవైన తెల్లటి గౌను.. దానిలో పొదిగిన నగలతో జిగిలుమనిపించే రీతిలో హాజరై సంచలనం రేపింది.
ఎటువంటి చింతా లేని ఫిబీకి.. 27 ఏళ్లుగా కలిసుంటున్న తల్లిదండ్రులు తాను ఎదిగిన వయసులో తనెదురుగా విడిపోవడం మాత్రం ఆమెను బాధించేదే అని చెప్పాలి. గేట్స్ కు ఉన్న సంపాదనను పిల్లలకు తలో 10 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని గతంలోనే ప్రకటించారు. ఆమె అక్కల కంటే తన తెలివితేటలతో, చురుకుదనంతో ఈ పోటీ ప్రపంచంలో తండ్రిలానే రాణిస్తుందని.. పైకొస్తుందని ఈమెను పరిశీలించిన వారి మాట.