ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్!

మనలో చాలామంది ప్రయాణ సమయంలో వాంతులు కావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి ఒక్కరూ తమ అవసరాల రీత్యా ఎప్పుడో ఒకప్పుడు జర్నీ చేసే ఉంటారనే సంగతి తెలిసిందే. జర్నీ చేసేటప్పుడు ఎక్కడ వికారం కలిగి ‘వాంతులు’ అవుతాయోనని చాలామంది భావిస్తారు. ప్రయాణించే వ్యక్తులకు వాహనంకు సంబంధించి ఆయిల్ వాసన వస్తే కూడా వికారంగా అనిపిస్తుందనే సంగతి తెలిసిందే.

వాహనంలో ప్రయాణించే సమయంలో సరైన సీటును ఎంచుకోవాలి. బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం మంచిది. విమానంలో అయితే రెక్కల మీద సీటు ఎంచుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు. వాహనం లోపల మంచి వెంటిలేషన్ ఉంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే వెళ్లి పోయేలా ఉంటే తగినంత గాలి తగిలే అవకాశం ఉంటుంది.

బయట వాతావరణాన్ని వీక్షిస్తూ ఆ భావన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు వేపుళ్లు, మసాలా, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాల జోలికి వెళ్లకూడదు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అల్లం క్యాండీలు లేదా స్నాక్స్ ప్యాక్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మధ్యమధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని ప్రయాణాలు చేయాలి.

కొందరికి పడుకుంటే ఈ భావన కలిగే ఛాన్స్ ఉండదు. గాలి పీల్చుకుని రీరాన్ని రీకాలిబ్రేట్ చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.