దంతాల మధ్య సందుల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో దంతాలకు సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. దంత సంబంధిత సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. తెల్లగా మరియు ఆరోగ్యంగా ఉండే దంతాలు నవ్వును అందంగా మార్చడంతో పాటు ఇతరుల్లో సైతం మంచి పేరును తెచ్చిపెడతాయని చెప్పవచ్చు.

రెండు దంతాల మధ్య గ్యాప్ ఉంటే డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పంటి నొప్పి సమస్య ఉన్నవారు సాఫ్ట్ టైప్ టూత్
బ్రష్ లను వినియోగిస్తే మంచిది. బ్రష్ హెడ్ చిన్నగా ఉంటేనే సులువుగా బ్రష్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రోజుకు రెండుసార్లు ఉదయం మరియు రాత్రి దంతాలను శుభ్రం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఆహారం తిన్న తర్వాత ప్రతిసారి పుక్కిలించడం ద్వారా ఆహార పదార్థాలు దంతాలకు అంటుకునే అవకాశాలు అయితే తగ్గుతాయి. స్వచ్ఛమైన ఆవనూనెతో స్విష్ చేయడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మైనంతో
పూసిన ఒక సన్నని దారం రెండు దంతాల మధ్య పంపడం ద్వారా రెండు పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని సులువుగా తొలగించవచ్చు.

కూల్ డ్రింక్స్, మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండటం ద్వారా పళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దంతాల తెల్లబడటానికి ఉప్పు చాలా ప్రభావవంతంగా పని చేసే అవకాశాలు ఉంటాయి. ఉప్పు నీళ్లతో పళ్లను పుక్కిలించడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.