రోజుకు రూ.1500 పొదుపుతో ఏడున్నర లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మనలో చాలామంది డబ్బు పొదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మాత్రమే వయస్సు పెరిగిన తర్వాత ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. రోజుకు రూ.1500 పొదుపుతో ఏడున్నర లక్షలు పొందే ఛాన్స్ ఉంది. అయితే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలిస్తే మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) లలో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. రిస్క్ లేకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పీపీఎఫ్ ఉత్తమం కాగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యే వాళ్లకు సిప్ మంచిదని చెప్పవచ్చు. డబ్బు విషయంలో ఒక్కొక్కరి విధానం ఒక్కో విధంగా ఉంటుంది.

రెండు స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది. వడ్డీ రేటు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ లో నెలకు 1500 రూపాయలు పెడితే 15 ఏళ్ల్ల తర్వాత ఏడున్నర లక్షలు పొందవచ్చు.

ఈ స్కీమ్ లో వడ్డీ 2.18 లక్షల రూపాయలు లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది ఈ రెండు స్కీమ్స్ డబ్బులు పొదుపు చేయాలని భావించే వాళ్లకు బెస్ట్ స్కీమ్స్ అవుతాయి.