రోజుకు రూ.138 పొదుపుతో రూ.23 లక్షలు పొందే అవకాశం.. ఈ ప్లాన్ గురించి తెలుసా?

ఈ మధ్య కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఆ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలసీ తీసుకున్న వాళ్లకు భారీ రేంజ్ లో బెనిఫిట్ కలుగుతోంది. ఎల్‌ఐసీ బీమా రత్న స్కీమ్‌ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిస్తుండగా ఈ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చని చెప్పవచ్చు. 15, 20 లేదా 25 సంవత్సరాల కాల వ్యవధితో ఈ పాలసీ తీసుకోవచ్చు.

10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ఏకంగా 23 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పాలసీదారుడు మరణిస్తే ప్రతి సంవత్సరం చెల్లించిన మొత్తంతో పోల్చి చూస్తే ఏడు రెట్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. కనీసం రెండేళ్లు ప్రీమియం చెల్లిస్తే పాలసీలను సరెండర్ చేయవచ్చు.

ఎల్‌ఐసీ బీమా రత్న స్కీమ్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్.ఐ.సీ ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎల్.ఐ.సీ పాలసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన సమయానికి ప్రీమియం చెల్లించకపోయినా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలసీని యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీలను ఆన్ లైన్ లో తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్.ఐ.సీలో వేర్వేరు పాలసీలు ఉండగా బెనిఫిట్స్ ఆధారంగా పాలసీలను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇతర పాలసీలతో పోల్చి చూస్తే ఎల్.ఐ.సీ పాలసీలు ఎక్కువ బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.