నేటి తరం పిల్లల్లో చాలామంది డబ్బులు పొదుపు చేసే విషయంలో ఒకింత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇంటర్ పాసైన విద్యార్థులు సులువుగా ఇప్పటినుంచి పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను సొంతం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రోజుకు కేవలం 50 రూపాయలు పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు అయితే సొంతమవుతాయి. సిప్ విధానంలో డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో కళ్లు చెదిరే లాభాలు సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తల్లీదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని డిపాజిట్ చేసినా 45 సంవత్సరాల తర్వాత 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందవచ్చు.
ఈ స్కీమ్ లో ఎవరైతే డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు చక్రవడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. రాబడిని 12 శాతంగా తీసుకుంటే ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ రాబడి ఎక్కువగా ఉంటే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.
అన్ని వయస్సుల వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్స్ కు సంబంధించి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి.