రూ.100 పొదుపుతో సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది రిటైర్మెంట్ సమయంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు సంపాదించే సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు మన ఆదాయం విషయంలో తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే వడ్డీపై వడ్డీని అందించే స్కీమ్స్ ను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. కేవలం రూ.100 ఆదా చేసి పెట్టుబడి పెట్టడం ద్వారా సులభంగా కోట్లు సంపాదించే ఛాన్స్ అయితే ఉంది.

చిన్న వయస్సులో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి. నెలకు రూ.3,000 చొప్పున రూ.12.60 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 35 సంవత్సరాల తర్వాత కోటీ 15 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.

కాంపౌండింగ్ పద్ధతిలో వడ్డీ ఊహించని మొత్తంలో పెరుగుతుండటంతో తెలివిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను సాధించవచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మాత్రమే ఈ లాభాలు సొంతమవుతాయి.

భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఇతర పొదుపు స్కీమ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు కొంత మొత్తంతో చేసే పొదుపు దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తుంది. ఎక్కడ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో ఆ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.