ప్రతి నెలా ఆదాయం ఉంటే మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితె ఉంటాయి. పెన్షన్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఊహించని స్థాయిలో లాభాలు సొంతమవుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయం కావాలని కోరుకునే వాళ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.
ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ పోతే లాభాలు అంతకంతకూ పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే లాభాలు సొంతమవుతాయి. 21 సంవత్సరాల వయస్సులో నెలకు కేవలం 3475 రూపాయలు పెట్టుబడి పెడితే 60 సంవత్సరాల వయస్సులో నెలకు 40,000 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ స్కీమ్ లో భాగంగా 40 సంవత్సాలలో పెట్టుబడి పెట్టే మొత్తం రూ.1,626,300 కాగా ఆ డబ్బు రిటైర్మెంట్ సమయానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. రిటైర్మెంట్ సమయంలో అవసరం అనుకుంటే 60 శాతాన్ని లంప్‌సమ్‌గా తీసుకుని మిగతా మొత్తాన్ని పెన్షన్ కొరకు వినియోగించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెన్షన్ పై 6 శాతం వార్షిక రాబడి లభిస్తుంది.
అయితే 40 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. అప్పటికి 40 వేల రూపాయలు అంటే కూడా తక్కువ మొత్తం అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.