నేషనల్ పెన్షన్ స్కీమ్ అదిరిపోయే ప్రయోజనాలివే.. నెలకు రూ.50,000 పెన్షన్ పొందే అవకాశం?

మనలో చాలామంది దీర్ఘకాలంలో సంపద కూడబెట్టాలని ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేయాలని భావిస్తున్నారు. అలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేసే స్కీమ్ ఏదనే ప్రశ్నకు నేషనల్ పెన్షన్ స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ స్కీమ్ లో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెడితే కళ్లు చెదిరే మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. నెలకు 4000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 45 ఏళ్ల తర్వాత దాదాపుగా కోటీ 15 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. జమ చేసిన మొత్తంలో కొంత మొత్తం విత్ డ్రా చేసుకుంటే నెలకు రూ.50,000 పొందవచ్చు.

డబ్బులు విత్ డ్రా చేసుకోకపోతే మాత్రం ఎక్కువ మొత్తం పెన్షన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే మంచిదని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.