ఛాతీలో గ్యాస్ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వేర్వేరు కారణాల వల్ల చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. సరైన సమయంలో తినకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్య తీవ్రమైతే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.

ఛాతీలో నొప్పి అంటే గుండెపోటు అని చాలామంది భావిస్తారు. గ్యాస్ వల్ల కూడా తీవ్రమైన నొప్పి కలిగితే కొంతమంది కంగారు పడతారు. జీర్ణవ్యవస్థలో గణనీయమైన గ్యాస్‌ను కలిగించే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల గ్యాస్​ నొప్పి నుంచి వేగంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా అదనపు గ్యాస్ బయటకు పోతుంది.

కొబ్బరి నీరు, సోంపు వాటర్ తాగడం ద్వారా మంచి బెనిఫిట్స్ ను పొందవచ్చు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడంలో అల్లం టీ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. కార్బోనేటేడ్ పానీయాలు, సోడాలు, పాలు, పాల ఉత్పత్తులు, గ్లూటెన్‌లకు దూరంగా ఉంటే గ్యాస్ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు.

వాకింగ్, స్విమ్మింగ్, యోగా, లేదా ఏదైనా ఇతర పద్ధతులలో వ్యాయామం చేయడం ద్వారా గ్యాస్ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మసాలా, నూనె లేదా కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఓట్స్, కిచ్డీ, ఆకుకూరలు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, గింజలు, గుడ్డులోని తెల్లసొనను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.