చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతోందా.. సహజంగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టడం కష్టం కాదు. చాలా సందర్భాల్లో జన్యు సంబంధిత సమస్యల వల్ల జుట్టు తెల్లబడటం జరుగుతుంది. జుట్టు విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

హెయిర్ కలర్స్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లను సైతం ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. శరీరంలో బీ12 తగ్గిపోవడం వల్ల కూడా జుట్టు రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఆహారం నుంచి వాడే హెయిర్ ప్రోడక్ట్స్ వరకు జుట్టు రంగుపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హార్మోన్ల మార్పులు సైతం జుట్టు రంగు మార్పుకు కారణమవుతాయి.

జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఆముదం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఇ, ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జుట్టు రాలడానికి చుండ్రు కూడా కొన్ని సందర్భాల్లో కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆముదంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు రాలడం తగ్గించి జుట్టు సమస్యలకు కారణమవుతాయి.

కొబ్బరినూనెకు సమానంగా ఆవనూనెను కలిపి జుట్టుకు రాయడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆయుర్వేద షాపులలో దొరికే నీల భృంగాడి కూడా జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ద్వారా కూడా జుట్టు సమస్యలు దూరమవుతాయి.