టీ తాగడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. టీ తగకుండా రోజును ప్రారంభించని వారు చాలా మంది ఉన్నారు. అయితే టీ లో దాల్చిన చెక్క వేస్తే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా . దాల్చిన చెక్కను మనం రోజు తాగే టీ లో వేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి.
తయారు చేసే విధానం:
దాల్చిన చెక్క అలాగే నీటిలో ఉడకపెట్టవచ్చు లేదా పౌడర్‌గా చేసుకొని… టీ తయారు చేసుకోవచ్చు . దాల్చినచెక్క టీ కి చాలా ఔషధ గుణాలున్నాయి. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే కాఫీ లేదా టీ లో కలుపుకొని తాగాలి. పళ్ల రసాల్లోనూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగవచ్చు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో సిన్నమోన్ టీ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని తాగినా ప్రయోజనం ఉంటుంది. ఓ కప్పు వేడి నీటిలో ఓ టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగాలి.
ఉపయోగాలు:
* గుండె పని తీరు ఆరోగ్యంగా ఉంటుంది
* బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
* బరువు తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది
* తొందరగా ముసలితనం రాదు
* షుగర్, కేన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు దూరం గా ఉంచుతుంది .
* కడుపులో వచ్చే మంట వంటివి పోవాలన్నా, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగితే మంచిది. నడుం చుట్టూ రింగులా ఉండే కొవ్వు కరిగిపోవాలంటే… దాల్చిన చెక్క టీ తాగాలన్నది నిపుణుల సలహా.
రోజు మనం తాగే టీలో ఒక్క దాల్చిన చెక్కను ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తాము టీ తాగుతున్నపుడు దాల్చిన చెక్కను వేసుకోవడం మర్చిపోకూడదు.