గుడ్లు తింటే లావైపోతామనుకునే వారి భ్రమను తొలగించండి, ఈ న్యూస్ మీరు చదివి అందరికి చెప్పండి

బరువు తగ్గి ఫిట్ గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు, దూల తిరిపోద్ది. బరువు పెరగడానికి మనకు ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే హెల్ప్ చేస్తాయో అలాగేబరువు తగ్గడానికి కూడా చాలా ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి. మనం ఆరోగ్యాల భారిన తక్కువ పడాలంటే మన దేహంలో శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు అవసరం. ఇవ్వని మనకు ఒకే ఆహారంలో ఇందులో లభిస్తాయంటే కోడి గుడ్డు. కోడి గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది అపోహ కలిగి ఉంటారు కానీ అందులో నిజం లేదు. బాడీ లో ఉండే కొలెస్ట్రాల్ కు, ఫుడ్ నుండి వచ్చే కొలెస్ట్రాల్ కు అస్సలు సంబంధం ఉండదు.

గుడ్డులో ఉండే పోషకాలు:

గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి కనీసం మూడు నుండి ఐదు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.వీటితోపాటు శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు కూడా ఉంటాయి.

లాభాలు:

బరువు తగ్గాలనుకునే వారు గుడ్డును వారానికి కనీసం ఐదు రోజులు, రోజుకు రెండు గుడ్ల చొప్పున తింటే బరువులు సులభంగా తగ్గవచ్చు. అలాగే రోజంతా బరువు తగ్గడానికి గుడ్లు సహకరిస్తాయి. ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల,బరువు తగ్గడం సులభం.అందుకే బరువును తగ్గించుకునేందుకు గుడ్డు ఉపయోగపడుతుంది. అందులోగుడ్డులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తినగానే కడుపు నిండిపోతుంది.కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు… అందువల్ల తక్కువ ఆహారం తీసుకొని బరువును అదుపు చేసుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది .అందుకే డైటింగ్‌లో ఉన్నవారుతప్పకుండ గుడ్డును తీసుకోవాలి.