మానవ దేహంలో దాదాపు 60-70% నీరు ఉంటుందని మనందరికీ తెల్సు. మానవ దేహంలో ఉన్న రక్తంలో 50%, మెదడులో 80-85%, కండరాల్లో 70-75%, బోన్స్ లో 20-25% వాటర్ ఉంటుంది. సహజంగానే వాటర్ ఎంత తాగితే అంత మంచిది. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి వేడు నీళ్లు తాగడానికి అలవాటు పడితే మాములు నీళ్లు తాగడానికి అసలు ఇష్టపడరు. ప్రతిరోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందుగా రెండు లేదా మూడు గ్లాస్ ల మంచి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాల మంచిది.
గ్లాస్ లోకి తీసుకున్న వేడి నీళ్లను ఒకేసారి తగకుండా నోటిలోకి నీటిని తీసుకొని మెల్ల మెల్లగా గుటకలు వేస్తూ తాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల చాలా తక్కువ రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తాం.
ప్రతి రోజు వేడి నీటిని తాగడం వల్ల అదుపులోకి వచ్చే లేదా అసలు దరి చేరకుండా ఉండే రోగాలు:
ప్రతిరోజు వేడి నీళ్లు తాగితే చాలరోగలు మన జోలికి అసలు రావు. గుండె జబ్బులు, మధుమేహం, ఉదర సంబంధిత వైద్యులు మనం ప్రతిరోజు వేడి నీరు తాగడం వల్ల మన దరికి చేరవు.
* అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ఈ పద్ధతి పాటించడం వల్ల తక్కువ రోజుల్లోనే చక్కటి ఫలితాలు చూస్తారు.
*అలాగే మధుమేహం వస్తుందేమోనన్న అనుమానం ఉన్నవారు తప్పకుండా ఈ పద్ధతిని పాటించాలి.
*అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ప్రతిరోజు కాచిన నీటిని తాగడం వల్ల సమస్యను తొలగించుకోవచ్చు.
* అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు.
*దగ్గు, జలుబు వచ్చినప్పుడు కూడా ఇలా చేయడం చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
ఇలా ప్రతిరోజు వేడి నీటిని తాగితే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. వేడి నీటిలో ఒక నిమ్మ కాయను పిండుకోని తాగినా కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు. వేసవి. కాలంలో కూడా వేడి నీటిని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేట్ కాకుండా చేస్తుంది. ప్రతిరోజు వేడి నీటిని తాగుదాం, ఆరోగ్యంగా ఉందాం.